తెలంగాణ

telangana

Passion fruit benefits: హుస్నాబాద్​లో అరుదైన ఫ్యాషన్ ఫ్రూట్ సాగు.. లాభాలెన్నో తెలుసా?

By

Published : Nov 8, 2021, 2:10 PM IST

Updated : Nov 8, 2021, 2:50 PM IST

ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న ఫ్యాషన్ ఫ్రూట్​ను(Passion fruit benefits) సిద్దిపేట జిల్లాలో ఓ రైతు సాగు చేస్తున్నారు. ఈ అరుదైన పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ మొక్కను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎలా సాగు చేస్తున్నారు? ఈ పండుతో కలిగే లాభాలేంటో తెలుసుకుందాం రండి...

Passion fruit benefits, Passion fruit farming
ఫ్యాషన్ ఫ్రూట్ లాభాలు, ఫ్యాషన్ ఫ్రూట్ సాగు

ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న అరుదైన ఫ్యాషన్ ఫ్రూట్(Passion fruit benefits)​ సిద్దిపేట జిల్లా​లో సాగవుతోంది. హుస్నాబాద్​కు చెందిన కూరగాయల ఐలయ్య అనే రైతు తన నర్సరీలో ఈ పండును సాగుచేసి ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఫ్యాషన్ ఫ్రూట్(Passion fruit benefits) మొక్కను బెంగళూరు నుంచి తీసుకొచ్చి... అంటుకట్టి తన నర్సరీలో నాటినట్లు రైతు ఐలయ్య తెలిపారు. ఒక్క ఫ్యాషన్ ఫ్రూట్ రసం నుంచి వచ్చే శక్తి దాదాపు ఆరు రకాల పండ్ల రసాల నుంచి వచ్చే శక్తితో సమానం అని... ఈ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఆయన వివరించారు.

ఈ ఫ్యాషన్ ఫ్రూట్​ తినడం వల్ల కరోనా లాంటి వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. మార్కెట్​లో ఒక ఫ్యాషన్ ఫ్రూట్ ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతోంది. ఒకే పండులో దాదాపు ఆరు రకాల పండ్లకు చెందిన మినరల్స్, ప్రోటిన్స్ లభించడం ఈ ఫ్రూట్(Passion fruit benefits) ప్రత్యేకత. పందిరి విధానంలో పండించే ఈ ఫ్యాషన్ ఫ్రూట్​ను ప్రపంచ దేశాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అరుదైన ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలను నర్సరీలో పెంచారు. ఈ నర్సరీని పలువురు ఆసక్తిగా సందర్శించి... ఫ్యాషన్ ఫ్రూట్ వల్ల కలిగే లాభాలను తెలుసుకుంటున్నారు.

ఫ్యాషన్ ఫ్రూట్​ను నేను 15 సంవత్సరాల కింద తీసుకొచ్చాను. దానిని ఒక వేపచెట్టుకు పెట్టాను. కానీ అది దెబ్బతిన్నది. ఆ తర్వాత మళ్లీ బెంగుళూరు నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు మంచి పంట వచ్చింది. నాలుగు, ఐదు రకాల పండ్ల రసాలను జ్యూస్ తాగితే ఎంత బలం ఉంటుందో... ఈ ఒక్క పండులోనే అంత బలం ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల కరోనా వంటి ఇతర వ్యాధులను రాకుండా ఉంటాయి. అవసరం ఉంటే ఎవరైనా ఈ పండ్లు, లేదా చెట్లనైనా తీసుకుపోవచ్చు.

-కూరగాయల ఐలయ్య, రైతు

కరోనా కాలంలో చాలామందికి శరీరంలో రోగనిరోధక శక్తిపై స్పృహ కలిగింది. అందుకే ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఆహారం, వివిధ రకాల పండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ధరలతో సంబంధం లేకుండా పండ్లను కొంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్, డ్రైఫ్రూట్స్ వంటి వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న ఫ్యాషన్ ఫ్రూట్ తెలంగాణలో సాగవడం మంచి విషయం. అయితే ఈ పండుతో లాభాలు మెండు అని హుస్నాబాద్ రైతు ఐలయ్య వివరించారు.

హుస్నాబాద్​లో అరుదైన ఫ్యాషన్ ఫ్రూట్ సాగు

ఇదీ చదవండి:Farmer died in Medak district: పొలం పోతుందనే బెంగతో తనువు చాలించిన రైతు

Last Updated :Nov 8, 2021, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details