తెలంగాణ

telangana

లాక్​డౌన్ ఎఫెక్ట్: బ్యాంకుల ముందు పడిగాపులు

By

Published : May 26, 2021, 1:50 PM IST

లాక్​డౌన్ ప్రభావంతో బ్యాంక్ పని వేళలను కుదించారు. సిబ్బందిని తగ్గించారు. ఈ క్రమంలో ఖాతాదారులకు తిప్పలు తప్పడం లేదు. ఉదయం నుంచి వచ్చి బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఒక్కోసారి నగదు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

people waiting in front of banks, husnabad banks rush
బ్యాంకుల ముందు జనం రద్దీ, హుస్నాబాద్ బ్యాంకుల ఎదుట రద్దీ

లాక్​డౌన్ ప్రభావంతో బ్యాంకుల పని వేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుదించడం వల్ల వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకుల ఎదుట ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. యాభై శాతం మంది ఉద్యోగులు పని చేస్తుండడం, బ్యాంక్​లో భౌతిక దూరం పాటించడం వల్ల ఎదురు చూడాల్సిన వస్తోందని వాపోయారు.

ధాన్యం విక్రయించిన డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయే లేదో తెలుసుకోవడానికి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హుస్నాబాద్​లోని పలు బ్యాంకుల్లో నగదు లేదని... వచ్చేదాకా ఆగాలని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఖాతాదారులు అసహనం వ్యక్తం చేశారు. నిరాశతో వెనుదిరిగారు. కొందరు బ్యాంక్ బయట భౌతిక దూరం పాటించడం లేదు.

ఇదీ చదవండి:వ్యాక్సిన్​ వేసుకుంటే రెండేళ్లలో మరణిస్తామనేది.. నిజమా? అబద్ధమా?

ABOUT THE AUTHOR

...view details