తెలంగాణ

telangana

పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే రఘునందన్‌ రావు నిరసన

By

Published : Mar 31, 2022, 8:34 PM IST

Mla Raghunandan rao: ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. పెద్దసంఖ్యలో భాజపా కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది.

MLA Raghunandan Rao
ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Mla Raghunandan rao: ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. పెద్దసంఖ్యలో భాజపా కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మిరుదొడ్డి స్టేషన్‌లో ఎమ్మెల్యే, దుబ్బాక సీఐ కృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ, ఎస్‌ఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఆయన నాలుగు గంటా పాటు స్టేషన్‌లో బైఠాయించారు.

తొగుట మండలం గుడికందులలో పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మెలుగుతున్నారని రఘునందన్‌ మండిపడ్డారు. భాజపా శ్రేణులు స్టేషన్‌లోకి రాకుండా పోలీసులు గేటు మూసివేయగా స్టేషన్‌లోనే వంటా వార్పునకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.

సమాచారం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి మిరుదొడ్డి పోలీసు స్టేషన్‌కు చేరుకుని... ఆందోళన విరమించాలని ఎమ్మెల్యే రఘునందన్‌ను కోరారు. అందుకు ఆయన సీపీ వచ్చేంత వరకు విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుకు నిరసనగా స్టేషన్ ఎదుట తెరాస నాయకులు ఆందోళనకు దిగారు. ఏసీపీ దేవారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మిరుదొడ్డి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details