తెలంగాణ

telangana

సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: ఇంద్రకరణ్

By

Published : Apr 9, 2021, 1:48 PM IST

సిద్దిపేట జిల్లా నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలోని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అభిప్రాయపడ్డారు.

minister indrakaran reddy at lakshmi narasimha swamy temple, nachagiri lakshmi narasimha swamy temple
నాచగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ నాచగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు.

కొండపోచమ్మ జలాశయం నుంచి హల్దీ వాగుకు నీటి విడుదల చేయడంతో అక్కడి రైతుల కళ్లల్లో ఎంతో ఆనందం కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ హనుమంతరావులతో పాటు అధికారులు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'18 ఏళ్లు దాటితే నచ్చిన మతం ఎంచుకోవచ్చు'

ABOUT THE AUTHOR

...view details