తెలంగాణ

telangana

రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి: హరీశ్

By

Published : Mar 21, 2021, 8:12 PM IST

రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని మంత్రి హరీశ్ రావు పెస్టిసైడ్ డీలర్లను కోరారు. త్వరలోనే చిన్నకోడూర్ మండలం చండ్లపూర్ గ్రామ రైతులతో కలిసి సెరికల్చర్ ఎక్స్ పోజర్ విజిట్ కోసం మైసూర్ వెళ్లనున్నట్లు చెప్పారు. దేశాయ్ కోర్సు పూర్తి చేసిన 40 మంది ఫెస్టిసైడ్స్ డీలర్లకు సిద్దిపేట కలెక్టరేట్​లో మంత్రి ధ్రువపత్రాలను అందజేశారు.

minister-harish-rao-about-organic-farming-in-siddipet-district
రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి: హరీశ్

సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామాన్ని వచ్చే వానాకాలం వరకు విత్తనోత్పత్తి గ్రామంగా చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడకుండా జాగ్రత్త పడేలా రైతులకు అవగాహన కల్పించాలని ఫెస్టిసైడ్స్ డీలర్లను కోరారు. డీలర్ల శిక్షణకు న్యాయం జరగాలంటే.. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా చేయాలని అన్నారు. మేనేజ్ సహకారంతో దేశాయ్ కోర్సు పూర్తి చేసిన 40 మంది ఫెస్టిసైడ్స్ డీలర్లకు సిద్దిపేట కలెక్టరేట్​లో మంత్రి ధ్రువపత్రాలను అందజేశారు.

ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పండించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ పనిముట్ల కోసం రూ.1500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నెల 28న ఆయిల్ ఫామ్ సాగుపై 2 వేల మంది రైతులతో వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్​ను మంత్రి ఆదేశించారు.

క్షేత్ర స్థాయి పర్యటనలు

త్వరలోనే చిన్నకోడూర్ మండలం చండ్లపూర్ గ్రామ రైతులతో కలిసి సెరికల్చర్ ఎక్స్​పోజర్ విజిట్ కోసం మైసూర్ వెళ్లనున్నట్లు మంత్రి చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయిల్ ఫామ్ సాగుపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తోర్నాల, బుస్సాపూర్, ఇర్కోడ్, చిన్నగుండవెళ్లి, ఎల్లుపల్లి, నాంచారుపల్లి, మందపల్లి, మల్లారం గ్రామాల్లో 500 ఎకరాల్లో తెలంగాణ సోనా ధాన్యం పండించేందుకు దక్కన్ ముద్ర కంపెనీ ముందుకొచ్చి మంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి:కలెక్టర్ సిక్తా పట్నాయక్ వర్సెస్ ఎమ్మెల్యే రామన్న

ABOUT THE AUTHOR

...view details