తెలంగాణ

telangana

Harish rao: నీటమునిగిన వాటర్‌ ప్లాంట్‌... పరిశీలించిన మంత్రి హరీశ్‌

By

Published : Aug 31, 2021, 11:49 AM IST

Harish rao about hmws, Harish rao about water plant

సిద్దిపేట జిల్లా మల్లారంలో నీటమునిగిన వాటర్ ప్లాంట్‌ను మంత్రి హరీశ్ రావు(Harish rao) పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మల్లారంలో నీటమునిగిన వాటర్‌ప్లాంట్‌ను ఆర్థికమంత్రి హరీశ్‌రావు(Harish rao) పరిశీలించారు. వరదనీటితో హెచ్‌ఎండబ్ల్యూఎస్(HMWS)కు చెందిన పంప్ హౌజ్ నీట మునిగింది. రెండు మూడు రోజుల్లోనే తాత్కాలికంగా సమస్యను పరిష్కరించి.... నీటి సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. అంతవరకు హైదరాబాద్‌కు ఉస్మాన్‌సాగర్‌, సింగూరు, గండిపేట నుంచి తాగునీటి పంపిణీ పెంచుతామన్నారు. భవిష్యత్‌లో భారీ వరదలు వచ్చినా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లాలో 4 గంటల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసిందని మంత్రి అన్నారు. కుండపోత వర్షంతో చిన్న కోడూరు మండలం మల్లారం గ్రామంలోని హెచ్‌ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని 6.6 కేవీ పంప్ హౌజ్ నీట మునిగిందని పేర్కొన్నారు. ఫలితంగా సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్ పరిధిలోని 1950 హాబిటేషన్లకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని తెలిపారు.

దాన కిషోర్ నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నాం. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో తాగునీటి పంపింగ్ చేపడుతాం. సీఎం కేసీఆర్(cm kcr) దూరదృష్టితో రింగ్ మెయిన్ ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్నాం. హిమాయత్ సాగర్, గండిపేట, ఉస్మాన్ సాగర్, సింగూరు నుంచి హైదారాబాద్‌కు తాగునీటి సరఫరా పెంచుతాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతాం.

-హరీశ్ రావు, ఆర్థిక మంత్రి

ఇదీ చదవండి:నిండుకుండను తలపిస్తున్న.. హైదరాబాద్ జంట జలాశయాలు

ABOUT THE AUTHOR

...view details