తెలంగాణ

telangana

Harish Rao Paddy: 'ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నుంచి సహకారం లేదు'

By

Published : Nov 1, 2021, 4:45 PM IST

సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao Paddy) ప్రారంభించారు. జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు 396 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే 265 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు

Harish Rao
హరీశ్‌రావు

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందటం లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao Paddy) ఆరోపించారు. ఎఫ్​సీఐ (FCI) నిర్ణయాన్ని మార్చుకోవాలని మంత్రి సూచించారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు.

జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు 396 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే 265 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో మిగతావి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచామని హరీశ్‌రావు వెల్లడించారు.

గతంలో చూస్తే కేవలం 60, 70వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు ఉండేది. కానీ ఇవాళ 3 లక్షల ఎకరాలకు వరి సాగు పెరిగిందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే. సిద్దిపేట జిల్లాలో రెండింతలు, మూడింతల వరి సాగు పెరిగింది. ఈసారి పంట దిగుబడి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

-- హరీశ్​రావు, మంత్రి

'ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నుంచి సహకారం లేదు'

ఇదీ చదవండి:Huzurabad by-election results: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనే అంతటా చర్చ.. గెలుపు ఎవరిది..?

ABOUT THE AUTHOR

...view details