తెలంగాణ

telangana

CS Somesh: 'గజ్వేల్​ మార్కెట్ అద్భుతం... తెలంగాణలో మరిన్ని నిర్మిస్తాం'

By

Published : Jun 14, 2021, 4:44 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో సీఎస్ సోమేశ్ కుమార్ (Cs Somesh Kumar) పర్యటించారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన కాలనీని, గజ్వేల్​ మార్కెట్​ను ఆయన పరిశీలించారు.

Cs somesh kumar
గజ్వేల్​ మార్కెట్

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్​ అద్భుతంగా ఉందని సీఎస్ సోమేశ్​కుమార్ (CS Somesh Kumar) అన్నారు. ఈ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు.

సీఎం ఆదేశాల మేరకు ఆయన ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ముందుగా ములుగు మండలం తునికి బొల్లారంలోని కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిశీలించారు. గజ్వేల్​లో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్​ను సందర్శించి సౌకర్యాలు, క్రయవిక్రయాలపై వ్యాపారులతో మాట్లాడారు.

సీఎస్ సోమేశ్​కుమార్ స్వాగతం పలుకుతున్న అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ల నిర్మాణం కోసం రూ. 500 కోట్లు కేటాయించినట్లు సీఎస్ (Cs Somesh Kumar) స్పష్టం చేశారు. మార్కెట్​ నిర్మాణంపై కలెక్టర్​కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్​ రంజన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్ మాదాసు అన్నపూర్ణ, మున్సిపల్ ఛైర్మన్ ఎంసీ రాజమౌళి, కమిషనర్ వెంకట గోపాల్​తో పాటు పలువురు ఉన్నారు.

సమీకృత మార్కెట్ ఆవరణలో సీఎస్, అధికారులు

ఇదీ చదవండి:School paintings: బడిగోడలపై చేనేతకు పట్టంకట్టిన సిరిసిల్ల పాఠశాల

ABOUT THE AUTHOR

...view details