తెలంగాణ

telangana

అసాంఘికం: బడిలో మందుబాబుల ఇష్టారాజ్యం

By

Published : Jul 7, 2020, 3:33 PM IST

Updated : Jul 7, 2020, 4:08 PM IST

దేవాలయం లాంటి ప్రాథమిక పాఠశాలలో ప్రతిరోజు రాత్రి వేళల్లో మందు బాబులు మద్యం సేవించి, బాటిల్స్​ను పగలగొట్టి పాఠశాలను తాగుబోతులకు అడ్డాగా మార్చారు. కొందరి మందుబాబుల నిర్వాకంతో సరస్వతి నిలయం కాస్తా నిషాలయంగా మారింది. కొన్ని సందర్భాల్లో కిటికీలను, తలుపులను ధ్వంసం చేస్తున్నారు. ఎవ్వరూ పట్టించుకోకపోవటం వల్ల మందుల బాబులదే ఇష్టారాజ్యంగా మారింది.

Alcohol Drinkers siting in Akkanapeta Government school in Siddipeta district
నిషాలయంగా మారిన... సరస్వతి నిలయం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారిందని బీజేవైఎం జిల్లా నాయకుడు కర్ణ కంటి నరేష్ అన్నారు. మంగళవారం ఆయన గౌరవెల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకపోవటం వల్ల మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

పాఠశాల అనే విజ్ఞత కూడా లేకుండా స్కూలు తలుపులు, కిటికీలను పగలగొట్టి లోపల మద్యం సేవిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలలో వీరంగం సృష్టిస్తున్న మందుబాబులపై దృష్టి పెట్టాలని డిమాండ్​ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Last Updated :Jul 7, 2020, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details