తెలంగాణ

telangana

Zaheerabad Integrated Market Not Allocated To Beneficiaries : ప్రారంభమై పది నెలలైనా.. నిరుపయోగంగా సమీకృత మార్కెట్‌

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 9:44 PM IST

Zaheerabad Integrated Market Not Allocated To Beneficiaries : కొనుగోలుదారుల సౌకర్యం.. విక్రయదారుల సౌలభ్యం.. కోసం ఏర్పాటు చేసిన సమీకృత కూరగాయలు, మాంసాహార మార్కెట్ ఏర్పాటు లక్ష్యం నీరు గారుతోంది. పురపాలిక ఆదాయ ఆర్జన కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్మించిన మార్కెట్ నిరుపయోగంగా మారింది. పట్టణ ప్రధాన రహదారిపై రూ.10 కోట్లతో నిర్మించి.. ప్రారంభించినా ప్రయోజనం లేకుండా పోయింది. మార్కెట్ నిర్మాణం చేపట్టిన గుత్తేదారుకు.. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల.. వారు భవనాన్ని అప్పగించలేదు. దీంతో అసలు సమస్య నెలకొంది.

Zaheerabad Integrated Market Not Allocated To Beneficiaries
Zaheerabad Integrated Market

Zaheerabad Integrated Market Not Allocated To Beneficiaries ప్రారంభమై పది నెలలైనా నిరుపయోగంగా సమీకృత మార్కెట్‌

Zaheerabad Integrated Market Not Allocated To Beneficiaries :పురపాలికకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు వ్యాపారాలకు దుకాణాల కొరత తీర్చాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం బహుళ ప్రయోజన విధానంలో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్(Integrated Veg and Non Veg Market) నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్ 27వ తేదీన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్​రావుతో కలిసి మంత్రి హరీశ్​రావు(Minister Harish Rao) సమీకృత మార్కెట్​ను ప్రారంభించారు.

దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్​లో 33, మొదటి అంతస్తులో 34 కలిపి మొత్తం 67 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 53 దుకాణాలకు 2023 ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. 8వ తేదీన వేలం ప్రక్రియ పూర్తి చేశారు. వేలం, కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ కేటాయింపు జరగలేదు. వేలంలో షాపులు దక్కించుకున్న వారు నిత్యం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కమిషనర్, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు.

Telangana Institute of Hotel Management Sangareddy : గతమెంతో ఘనకీర్తి ఉన్నా.. కరోనా తర్వాత పరిస్థితి దయనీయం

మూడు నెలల అద్దె చెల్లిస్తే.. రిజిస్ట్రేషన్ చేయిస్తాం..: వేలంలో పాల్గొనేందుకు రూ.50 వేలు డిపాజిట్ చేయడంతో పాటుదుకాణం కేటాయింపు చేయడంతో ఆరు నెలల అద్దె అడ్వాన్సుగా చెల్లించామని దుకాణదారులు చెబుతున్నారు. వీటితో పాటు రూ.2 లక్షల విలువైన సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించినా దుకాణం అప్పగించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. కేటాయించిన దుకాణాలను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని వేలంలో దుకాణాలుదక్కించుకున్న వారు కోరుతున్నారు. ఇందుకోసం మూడు నెలలకు సంబంధించి అద్దె చెల్లిస్తే లబ్దిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే తాము ఇప్పటికే నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించామని దుకాణాలు దక్కించుకున్నవారు అంటున్నారు. ప్రధాన రహదారి కాబట్టి ఆర్థికంగా కలిసి వస్తుందని వేలంలో దక్కించుకున్న ఆశ.. నిరాశగా మిగులుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఫ్లెక్సీ ప్రింటింగ్ కోసం వీటిల్లో ఒక షెటర్​ని తీసుకున్నాను. అది నాకు అలాటై సుమారు ఆరు నెలలు దాకా అవుతోంది. డబ్బులు కూడా బయట వడ్డీకి తీసుకొని కట్టాను. ఆరు నెలల అడ్వాన్స్​ కట్టాలంటే అవి కూడా కట్టేశాను. కానీ, ఇప్పటి వరకు దానిని మాకు ఇవ్వలేదు. అడిగితేనేమో మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి.. తర్వాత మీకు అది ఇస్తామంటున్నారు. మరి ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. తొందరగా దీనిని క్లియర్ చేయాలని కోరుతున్నా."-బాధిత వ్యాపారి

బేగంబజార్​లో అందుబాటులోకి సమీకృత చేపల మార్కెట్

అధికారుల ఆలస్యం కారణంగా వ్యాపారుల ఇబ్బందులు : దుకాణాలు దక్కించుకున్నామన్న ధీమాతో.. ఇది వరకు వ్యాపారాలు నిర్వహించే షట్టర్లను ఖాళీ చేశామని.. ప్రస్తుతం ఖాళీగా ఉన్నామంటూ బాధితులు చెబుతున్నారు. పురపాలక అధికారుల ఆలస్యం కారణంగా వ్యాపారులు ఇబ్బందులు పడటంతో పాటు పురపాలిక సైతం ఆదాయాన్ని కోల్పోతోంది. దుకాణ సముదాయం తెరుచుకోకపోవడంతో సెల్లార్లో దుకాణాలు కేటాయించిన కూరగాయల వ్యాపారులు మార్కెట్ ఎదుట తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్రయాలు చేపడుతున్నారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలు(Traffic Problems on Road) మొదలయ్యాయి. తమకు సెల్లార్లో కేటాయించిన దిమ్మెల వద్ద సౌకర్యాలు లేకపోవడంతో పాటు మార్కెట్​కు కేవలం ఒకటే ప్రధాన ద్వారం ఉండడంతో గిరాకీ కావడం లేదని వ్యాపారాలు వాపోతున్నారు. మార్కెట్​కు మరో రెండు, మూడు వైపుల ద్వారాలు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని కోరుతున్నారు.

Viral Video of Theft at More Super Market : ఇలా వచ్చారు.. అలా దోచేశారు.. కెమెరాలు ఉన్నాయని చూసుకోవాలి కదా బ్రో

Khammam Mirchi Market: మిర్చి రైతుల కష్టాలు తీరేదెన్నడు...?

ABOUT THE AUTHOR

...view details