తెలంగాణ

telangana

'మంత్రి శ్రీనివాస్​గౌడ్​ డూప్లికేట్​ ఉద్యమకారుడు'

By

Published : Jul 21, 2020, 5:31 PM IST

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ డూప్లికేట్​ ఉద్యమకారుడని ఆరోపించారు. తాను తిట్టింది మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను మాత్రమేనని... అతని కులాన్ని కాదని స్పష్టం చేశారు.

'మంత్రి శ్రీనివాస్​గౌడ్​ డూప్లికేట్​ ఉద్యమకారుడు'
'మంత్రి శ్రీనివాస్​గౌడ్​ డూప్లికేట్​ ఉద్యమకారుడు'

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ డూప్లికేట్ ఉద్యమకారుడని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజమైన ఉద్యమకారుడు, పద్ధతి కలిగిన నాయకుడు స్వామిగౌడ్‌ మాత్రమేనని హైదరాబాద్​లో తెలిపారు. తాను తిట్టింది మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మాత్రమేనని... అతని కులాన్ని కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గౌడ సంఘం నాయకులకు... శ్రీనివాస్ గౌడ్‌ చరిత్ర అర్థం అయ్యేలా చేప్తానని పేర్కొన్నారు.

మమత భర్త పదవి విరమణ పొడిగింపునకు... గౌడ సంఘానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. టీజీవో సత్యనారాయణ, మమత, మంత్రి శ్రీనివాస్ గౌడ్​ల సంగతి అంతా బయటపెడుతానని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి మాటేమో కానీ... కరోనా అభివృద్ధి మాత్రం జరుగుతుందన్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details