తెలంగాణ

telangana

జహీరాబాద్​లో బాగన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: హరీశ్​ రావు

By

Published : Feb 27, 2021, 5:59 PM IST

నిజాయితీ గల నాయకుడిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. జహీరాబాద్​లో బాగన్న పార్థివదేహానికి నివాళులర్పించారు.

finance minister harish rao tributes to former mla chengal baganna in zaheerabad
చెంగల్ బాగన్న మృతి తీరని లోటు: హరీశ్​ రావు

మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లో​ని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికాకయాన్ని జహీరాబాద్​ తరలించారు. బాగన్న పార్థివదేహానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు నివాళులర్పించారు. బాగన్న నిజాయితీ గల నాయకుడిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

వార్డు సభ్యుడిగా, గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా ఎమ్మెల్యేగా, శాసనసభలో అంచనాల కమిటీ సభ్యుడిగా పనిచేసిన బాగన్న సొంత ఇల్లు కూడా లేని స్థితిలో మరణించడం బాధాకరమన్నారు. గతంలో ఇంటి స్థలం కేటాయించి నిర్మాణానికి కొంత ఆర్థిక సహాయం అందించామని... పార్టీ పక్షాన అవసరమైన నిధులు సమకూర్చి ఇల్లు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. జహీరాబాద్​లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హరీశ్​ హామీ ఇచ్చారు.

చెంగల్ బాగన్న మృతి తీరని లోటు: హరీశ్​ రావు

ఇదీ చదవండి:బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

ABOUT THE AUTHOR

...view details