తెలంగాణ

telangana

weather report: రాగల మూడురోజులు.. అక్కడక్కడ వర్షాలు

By

Published : Jul 26, 2021, 2:22 PM IST

తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.

weather report
వాతావరణ వివరాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... అది సముద్రమట్టానికి 1.5కిమీ నుంచి 5.8కిమీ ఎత్తు మధ్య కొనసాగుతూ... నైరుతి దిశకు వంపు తిరిగి ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.

ఈ ప్రభావంతో ఈ నెల 28వ తేదీన ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రం చిగురాకుల వణికింది. పలు చోట్లు వరదలు ముంచెత్తాయి. జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. చెరువులు, వాగులు మత్తడి పోసి... చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Upper Manair Dam : సుమనోహర దృశ్యం.. జల పరవళ్ల సోయగం

మరికొన్ని చోట్ల... రోడ్లు తెగిపోయాయి. వరద నీరు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో... ఇప్పుడిప్పుడే వరద తగ్గుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

ఇదీ చూడండి:Rains effect: వందల ఎకరాల్లోని పంట నీటిపాలు

FLOOD WATER: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. గోదావరి శాంతించింది

ABOUT THE AUTHOR

...view details