తెలంగాణ

telangana

పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి సబిత

By

Published : Feb 1, 2021, 3:50 PM IST

రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. తరగతుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పిల్లలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అందరూ కచ్చితంగా కొవిడ్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

minister sabitha indra reddy visited jillelguda government school
minister sabitha indra reddy visited jillelguda government school

రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. రెండు మూడు రోజుల్లో పూర్తి హాజరు శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల అనుమతి పత్రాలతో వచ్చారని పేర్కొన్నారు.

విద్యార్థులతో ముచ్చటిస్తూ...

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో విద్యాలయాల వద్ద పకడ్బందీగా కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. విద్యార్థులు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకుని... మాస్క్​లు పెట్టుకోవాలని, జ్వరం, జలుబు ఉంటే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. మధ్యాహ్న భోజనం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లపై వేరువేరుగా కొవిడ్ జాగ్రత్తలతో ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు.

విద్యార్థులతో పాటు మంత్రి భోజనం

ఇదీ చూడండి: 100 సైనిక స్కూళ్లు- 15వేల బడులకు కొత్త కళ

ABOUT THE AUTHOR

...view details