తెలంగాణ

telangana

విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి

By

Published : Jul 19, 2020, 9:12 PM IST

విద్యుదాఘాతంతో వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని బుచ్చిగుడ గ్రామ పరిధిలో చోటు చేసుకుంది.

విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి
విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్​లో ఉత్తర్ ప్రదేశ్​కు చెందిన అంజనా గుప్తా విద్యుదాఘతంతో మృతిచెందాడు. గత కొంత కాలంగా మిషన్ భగీరథ పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం జనరేటర్ ద్వారా విద్యుత్ వినియోగించుకోవాల్సి ఉండగా సమీపంలోని దుకాణం మీదుగా కనెక్షన్ తీసుకున్నాడు. అనంతరం పనులు చేస్తుండగా విద్యుత్ ప్రమాదం సంభవించింది. ఘటనలో కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాం పోస్ట్ మార్టం నిమిత్తం షాద్​నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి

ABOUT THE AUTHOR

...view details