తెలంగాణ

telangana

KTR In Rangareddy district : రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి దిక్సూచి : కేటీఆర్

By

Published : Jan 29, 2022, 2:56 PM IST

Updated : Jan 29, 2022, 4:18 PM IST

KTR In Rangareddy district : తెరాస ప్రభుత్వం ఎలాంటి రాజకీయలాభాపేక్ష లేకుండా పేదప్రజల అభివృద్ధే ధ్యేయంగా.. ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో జల్​పల్లి, తుక్కుకూడ, బడంగ్​పేట, మీర్​పేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని అన్నారు.

KTR In Rangareddy district , ktr about trs
రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR In Rangareddy district : తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు దేశం మొత్తానికి దిక్సూచి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని... ఎక్కడా లేనివిధంగా సెంటు భూమి ఉన్న రైతుకు కూడా బీమా అందిస్తున్నామని.. రైతు బీమా కింద రూ.5 లక్షలు చెక్కు అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి ఇవాళ పర్యటించి... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తెరాస సర్కార్ చేసిన అభివృద్ధిని వివరించారు.

రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

సర్కారీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతాశిశు మరణాలు తగ్గాయన్న మంత్రి... సర్కారీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని... హాస్టల్‌ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. హాస్టల్‌ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.లక్షా 20 వేలు ఖర్చుపెడుతున్నామన్న కేటీఆర్.. విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు అందజేస్తున్నామని వివరించారు. మహేశ్వరం నియోజకవర్గంలో రూ.207 కోట్లు మంచినీటి పైప్‌లైన్‌కు కేటాయించామన్న మంత్రి కేటీఆర్... మంత్రి నియోజకవర్గం మాత్రమే కాదు.. అందరికీ నిధులు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

తెరాస ప్రభుత్వం ఎలాంటి రాజకీయలాభాపేక్ష లేకుండా పేదప్రజల అభివృద్ధే ధ్యేయంగా.. ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో జల్ పల్లి, తుక్కుకూడ, బడంగ్ పేట, మీర్ పేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో ఒకేరోజు రూ.400కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్నప్పటికీ అభివృద్ధి దూరంగా ఉన్న శివారు మున్సిపాలిటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

తుక్కుగూడ మున్సిపాలిటీలో శంకుస్థాపనలు

  • రూ.4.50 కోట్లతో సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ పనులు
  • రూ.29 కోట్లతో నీటి పైపులైన్లు
  • రిజర్వాయర్ల పనులకు శంకుస్థాపన

జల్‌పల్లి మున్సిపాలిటీలో శంకుస్థాపనలు

  • రూ.72 కోట్లతో వాటర్‌లైన్లు
  • రూ.7కోట్లతో హెచ్‌ఎండీఏ నిధులతో రోడ్డు వెడల్పు పనులు
  • టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టే రోడ్ల పనులు
  • పహాడీషరీఫ్‌ రోడ్డు విస్తరణ పనులు
  • స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ పనులు
  • రాక్‌ గార్డెన్‌ పనులు

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో శంకుస్థాపనలు

  • తాగునీటి లైన్లు
  • బాక్స్‌ డ్రైనేజీ పనులు
  • రూ.కోటి 50 లక్షలతో రోడ్డు పనులు
  • రోడ్డు విస్తరణ పనులు
  • బీటీ రోడ్డు నిర్మాణం
  • సమీకృత మార్కెట్‌ సముదాయాలు
  • ఓపెన్‌ నాలాల నిర్మాణం

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో శంకుస్థాపనలు

  • రూ.82 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం పనులు
  • సమీకృత మార్కెట్‌ పనులు
  • రోడ్డు వెడల్పు పనులు
  • ఓపెన్‌ నాలాల నిర్మాణం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:trs parliamentary party meeting: రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

Last Updated :Jan 29, 2022, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details