తెలంగాణ

telangana

మాసబ్ చెరువును పరిరక్షించాలంటూ స్థానికులు ఆందోళన

By

Published : Jan 10, 2021, 11:21 AM IST

తుర్కయంజాల్ మాసబ్ చెరువును పరిరక్షించాలంటూ అఖిలపక్ష ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ఎన్నో కుటుంబాలు చెరువుపై ఆధారపడి ఉన్నాయని.. నీటిని వదిలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

in the presence of all party leaders locals are worried about the need to protect the Turkayamjal Masab pond
మాసబ్ చెరువును పరిరక్షించాలంటూ స్థానికులు ఆందోళన

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం తుర్కయంజాల్ మాసబ్ చెరువును పరిరక్షించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. చెరువు నీటిని వదలకూడదని.. చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికైనా హద్దు రాళ్లు పాతి చెరువును రక్షించాలని కోరారు.

ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ అధికారులు తుర్కయంజాల్ మాసబ్ చెరువుని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిత్యానగర్​లో ఇప్పటికీ ఉన్న నీటిని పూర్తిగా తీసివేయడానికి సుమారు 7 రోజుల సమయం పడుతుందని.. మాసబ్ చెరువు నుంచి నీరు దిగువకు వదిలితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు అంచనాకి వచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన రిపోర్ట్​ని ఉన్నతాధికారులకు పంపిస్తామని.. వారి ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత చెరువు నిండిందని.. చెరువు నీటిని వదిలితే ఊరుకునేది లేదని స్థానికులు హెచ్చరించారు. ఎన్నో కుటుంబాలు చెరువుపై ఆధారపడి ఉన్నాయన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన: తరుణ్ చుగ్

ABOUT THE AUTHOR

...view details