తెలంగాణ

telangana

అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం

By

Published : Apr 1, 2022, 9:58 PM IST

తుర్కయంజాల్ పురపాలక పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేయడం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

DEMOLISHES
కూల్చివేశారు

రంగారెడ్డి జిల్లా తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో పలు ప్రాంతాల్లో అక్ర‌మంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప‌ట్ట‌ణ ప్ర‌ణాళికా అధికారి అలీపాషా తెలిపారు. అక్ర‌మంగా నిర్మాణాలు చేప‌డితే ఉపేక్షించే ప్ర‌స‌క్తే లేదని ఆయన పేర్కొన్నారు.

మున‌గ‌నూరులోని ప్ర‌భుత్వ స్థ‌లంలో అక్ర‌మ నిర్మాణం చేప‌ట్టిన వ్యక్తిపై చర్యలు చేపట్టామని మున్సిపల్ క‌మిష‌న‌ర్ జ్యోతి తెలిపారు. మున్సిప‌ల్, రెవెన్యూ అధికారుల విచార‌ణ‌లో ప్ర‌భుత్వ భూమిలో ఇల్లు నిర్మించిన‌ట్టు తేలింది. అక్ర‌మంగా నిర్మించిన ఇంటిని రికార్డుల నుంచి తొల‌గించినట్టు క‌మిష‌న‌ర్ తెలియచేశారు.

అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు

ఇదీ చదవండి:Air Show in HYD: ఉగాది పర్వదినాన హైదరాబాద్​లో వైమానిక విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details