తెలంగాణ

telangana

రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల క్రమబద్ధీకరణ.. రెగ్యులర్ కోర్టులుగా..!

By

Published : May 15, 2022, 10:23 AM IST

fast track courts regularization

Courts Regularization: ప్రజలకు వేగంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా కార్యాలయాల ఏర్పాటు కోసం 1,098 పోస్టులు మంజూరు చేసింది.

Courts Regularization: రాష్ట్రంలో 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను రెగ్యులరైజ్ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు వేగంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన సర్కారు.. తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కోరింది. రెగ్యులరైజ్ చేసిన కోర్టుల్లో 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ క్యాడర్‌లోనివి కాగా.. మరో 16 సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్​లోనివి.

ఇక ఆయా కోర్టుల కార్యాలయ ఏర్పాటు కోసం 1098 పోస్టులను మంజూరు చేస్తూ... మరో జీవో విడుదల చేసింది. 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ క్యాడర్ కోర్టులకు సంబంధించి 682 పోస్టులు, 16 సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులకు 416 పోస్టులు మంజూరు చేసింది. దీంతో పాటు... మరో 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ కోర్టుల్లో 308 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details