తెలంగాణ

telangana

KTR: సీఎం కేసీఆర్ కార్యదక్షతతో వానాకాలం పంటకు నీళ్లు

By

Published : Jun 24, 2021, 4:58 AM IST

Updated : Jun 24, 2021, 6:17 AM IST

సీఎం కేసీఆర్ కార్యదక్షతతో అప్పర్ మానేరు ప్రాజెక్టు నుంచి చరిత్రలో తొలిసారి వానకాలంలో పంటలకు నీరు అందుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. సిరిసిల్ల రైతుల తరఫున.. సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు చెప్పారు.

ktr, sirisilla
కేటీఆర్​, మానేరు

అప్పర్ మానేరు ప్రాజెక్టు నుంచి చరిత్రలో తొలిసారి వానకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో.... సిరిసిల్ల రైతాంగం తరఫున.... సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలతో వేసవిలోనే అప్పర్ మానేరు నిండిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 2.2 టిఎంసీల నీటితో ప్రాజెక్టు జల కళను సంతరించుకొంది.

సీఎం కేసీఆర్ కార్యదక్షతతో వానకాలం పంటకు నీళ్లు వచ్చాయని మంత్రి వెల్లడించారు. జులై మొదటి వారంలో అప్పర్ మానేరు నీటి విడుదలకై ఇరిగేషన్ అధికారులకు ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. సిరిసిల్ల ప్రాంతం ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజం అవుతుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:JURALA: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. జూరాలకు జలకళ

Last Updated : Jun 24, 2021, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details