తెలంగాణ

telangana

రాజన్న సన్నిధిలో రద్దీ.. కొవిడ్​ నిబంధనలతో దర్శనం

By

Published : Dec 28, 2020, 12:18 PM IST

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత నెలకొంది. కొవిడ్​ నిబంధనలతో భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు.

devotees congestion in vemulavada on monday
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ.. కొవిడ్​ నిబంధనలతో దర్శనం

సోమవారం కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.

కొవిడ్ నిబంధనల నేపథ్యంలో అర్చకులు.. గర్భాలయంలో ప్రవేశాలు, ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు దర్శనం అమలుపరిచారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చదవండి:రామసేతు : అన్నదాతను ఆదుకునే ఆపద్బాంధువు

ABOUT THE AUTHOR

...view details