తెలంగాణ

telangana

బండి సంజయ్ ఆలోచించి మాట్లాడాలి: పుట్ట మధు

By

Published : Apr 7, 2021, 12:27 PM IST

తెరాస పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు బండి సంజయ్ ఆలోచించుకుని మాట్లాడాలని జడ్పీఛైర్మన్ పుట్ట మధు తెలిపారు. లేదంటే భాజపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు.

zp chairman putta madhu sensational comments on bandi sanjay at peddapalli district
బండి సంజయ్ ఆలోచించి మాట్లాడాలి: పుట్ట మధు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటనరీ కాలనీలో అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలను మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఎంపీ వెంకటేష్ ఆవిష్కరించారు. బండి సంజయ్ మంథనికి వచ్చి తెరాస పార్టీ గురించి, కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని పుట్ట మధు హెచ్చరించారు.

ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే పథకాలు ప్రవేశపెడుతుందని... రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని మధు వెల్లడించారు.

ఇదీ చూడండి:నేల తల్లికి పచ్చని బొట్టు పెడుతున్న మహిళా రైతులు

ABOUT THE AUTHOR

...view details