తెలంగాణ

telangana

మంథనిలో పుట్ట మధు పుట్టినరోజు వేడుకలు

By

Published : May 16, 2021, 1:01 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కరోనాతో మృతి చెందిన వారికోసం వైకుంఠరథాన్ని ప్రారంభించారు. కొవిడ్ హెల్ప్​లైన్ ఏర్పాటు చేసి మంథనిలో అంబులెన్స్​ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

zp chairman Putta Madhu, Putta Madhu birthday celebrations, Manthani
zp chairman Putta Madhu, Putta Madhu birthday celebrations, Manthani

పుట్టలింగమ్మ ట్రస్టు ద్వారా కేటీఆర్ కొవిడ్ హెల్ప్​లైన్ ఏర్పాటు చేసి మంథనిలో అంబులెన్స్​ను ప్రారంభిస్తామని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పుట్ట మధు తన జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. కరోనాతో మృతి చెందిన వారికోసం వైకుంఠరథాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు పుట్టమధుకర్ దంపతులను గజమాలతో సత్కరించారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని పుట్టమధు అన్నారు. కొవిడ్​ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటుందని.. లాక్​డౌన్ నియమాలను ఉల్లంఘించవద్దని కోరారు.

మంథని, కాటారంలో కేటీఆర్ ఆక్సిజన్ అంబులెన్సులను ఏర్పాటు చేస్తామని, వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ ఛైర్మన్ జక్కు శ్రీహర్షిణి, మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ, కొత్త శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

ABOUT THE AUTHOR

...view details