తెలంగాణ

telangana

రామగుండం ఫర్టిలైజర్స్​లో ఉత్పత్తి నిలిపేయాలని ఉత్తర్వులు

By

Published : May 29, 2022, 10:12 AM IST

Updated : May 29, 2022, 11:54 AM IST

రామగుండం ఫర్టిలైజర్స్
రామగుండం ఫర్టిలైజర్స్ ()

10:06 May 29

రామగుండం ఫర్టిలైజర్స్​లో ఉత్పత్తి నిలిపేయాలని ఉత్తర్వులు

పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్​లో ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణ నిబంధనలు పాటించలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. లోటుపాట్లను సరిచేయాలని పన్నెండు సూచనలు చేసినట్లు సమాచారం. మొదటి నుంచి ఆర్​ఎఫ్​సీఎల్ ప్రారంభోత్సవానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. గత ఏడాది కాలంగా కర్మాగారంలో యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. మూడు రోజుల క్రితమే ప్రధాని నరేంద్రమోదీ కర్మాగారంను అధికారికంగా ప్రారంభిస్తారనే ప్రచారం సాగింది.

పరిశ్రమ నుంచి అమ్మోనియా లీక్‌ వల్ల కొన్నాళ్లుగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై రామగుండం ఎమ్మెల్యే పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా కార్మికులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించలేదని.. ఉత్పత్తి అయిన అమ్మోనియా నిల్వ చేయడానికి సరైన స్థలం లేదని.. పూర్తిస్థాయిలో కార్మికులకు వైద్య సేవలు అందుబాటులో లేవని పీసీబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కర్మాగారానికి సరైన బాధ్యులను నియమించలేదని.. అధిక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న దృష్ట్యా తగు చర్యలు చేపట్టాలని పీసీబీ సూచించింది. అందుకనుగుణంగా గ్యారంటీ సొమ్ము రూ.12లక్షలను అధికారులు జప్తు చేశారు.

ఇదీ చదవండి:చేరిన కళాశాల నుంచే మరో వర్సిటీలో చదువుకోవచ్చు

ఆమెకు ఒకేసారి 16 గోల్డ్ మెడల్స్.. ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్​

Last Updated :May 29, 2022, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details