తెలంగాణ

telangana

'ప్రజలందరికీ తొందరగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ పూర్తి చేయాలి'

By

Published : May 9, 2021, 11:28 AM IST

కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు, కాంగ్రెస్​ కార్యకర్తలు జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ అన్నారు. ప్రజలందరికీ తొందరగా వ్యాక్సినేషన్​ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

mla sridhar babu instructions to manthani people
మంథని ప్రజలకు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు సూచనలు

కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రజలకు కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్​ చేశారు. ఐసోలేషన్​ సెంటర్లు, అధిక సంఖ్యలో కిట్లను అందుబాటులో ఉంచాలని.. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దని సూచించారు. కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:దండిగా ఫండుంది.. స్పందనే లేదండి!

ABOUT THE AUTHOR

...view details