తెలంగాణ

telangana

'పని చేయడానికి ముందుండాలి.. విమర్శలకు కాదు'

By

Published : Aug 20, 2020, 4:48 PM IST

పని చేయడానికి ముందుండాలి కానీ విమర్శలు చేయడానికి కాదని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.

manthani mla sridhar babu pays tribute to farmer prime minister rajiv gandhi
మంథనిలో రాజీవ్ గాంధీ జయంతి

పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

రాజీవ్ గాంధీ నవతరానికి ఆదర్శంగా నిలిచారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దేశభవిష్యత్​లో.. యువత భాగస్వామ్యం ఉండాలని 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించిన మహనీయుడని కొనియాడారు. కాంగ్రెస్​ త్యాగదనుల పార్టీ అని, ప్రజలకు మేలు చేయాలని నిరంతరం తపించే కుటుంబం గాంధీ కుటుంబమని ఎమ్మెల్యే అన్నారు. రాజీవ్ గాంధీ ఆలోచనా విధానాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details