తెలంగాణ

telangana

అనిశా అధికారులకు చిక్కిన వీఆర్వో

By

Published : Oct 29, 2019, 10:18 PM IST

పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పిడి కోసం లంచం డిమాండ్ చేశిన ఓ వీఆర్వో అడ్డంగా దొరికిపోయాడు.

అనిశా అధికారులకు చిక్కిన వీఆర్వో

పెద్దపల్లి జిల్లా పాలెం గ్రామంలో తిరుపతి ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకంలో పేరు మార్పిడి చేయడానికి వీఆర్వో లింగస్వామి ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించారు. మంగళవారం మధ్యాహ్నం పెద్దపల్లిలోని తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్వో లింగస్వామికి ఎనిమిది వేలు లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోపై కేసు నమోదు చేసి రేపు అనిశా న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అధికారులు వెల్లడించారు.

అనిశా అధికారులకు చిక్కిన వీఆర్వో
Intro:ఫైల్: TG_KRN_41_29_ACB TRAP_VO_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పట్టాదారు పాస్ పుస్తకం లో పేరు మార్పిడి కోసం ఒక వ్యక్తి వద్ద 8 వేలు లంచం తీసుకుంటూ పెద్దపెల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన విఆర్ఓ లింగస్వామి పడ్డాడు. 8 ఇంక్లైన్ కాలనీ కి చెందిన సిద్ధం తిరుపతి అనే వ్యక్తి ఇటీవల పాలెం గ్రామంలో ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం లో పేరు మార్పిడి చేయాలంటే విఆర్ఓ లింగస్వామి ఎనిమిది వేలు లంచం ఆశించినట్లు బాధితుడు తిరుపతి తెలిపాడు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని తిరుపతి ఇటీవల అనీషా అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పెద్దపల్లి లోని తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్వో లింగస్వామి కి ఎనిమిది వేలు లంచం ఇస్తుండగా అని అధికారులు పట్టుకున్నారు. అనంతరం విఆర్ఓ పై కేసు నమోదు చేసి రేపు అనీషా న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
బైట్: సిద్ధం తిరుపతి, బాధితుడు
బైట్: భద్రయ్య అనీష, డీఎస్పీ కరీంనగర్


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి

ABOUT THE AUTHOR

...view details