తెలంగాణ

telangana

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: కాలిబాట పట్టిన వలస కార్మికుల కష్టాలు

By

Published : Apr 14, 2020, 5:53 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వలస కార్మికులు పడరాని పాట్లు పడుతున్నారు. నిజామాబాద్​ వద్ద 44వ జాతీయ రహదారిపై గుంపులు గుంపులుగా నడిచి వెళ్తున్న కార్మికులు కనిపిస్తున్నారు.

The troubles of migrant workers going on foot in nizamabad
లాక్​డౌన్​ ఎఫెక్ట్​: కాలిబాట పట్టిన వలస కార్మికుల కష్టాలు

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్‌ అమలు చేస్తుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి పని చేయడానికి వచ్చిన కార్మికులు తమ స్వస్థాలకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. బస్సు, రైలు సౌకర్యం లేక కాలిబాటన వెళ్తున్నారు. ఎండవేడిమికి రోడ్డుపై నడుస్తూ తినడానికి తిండిలేక ఏమైన కొనుగోలు చేసుకోవడానికి దుకాణాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే 22 రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. దీనితో ఇప్పటికే వివధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు వాహన సౌకర్యం లేక మధ్యలో ఎవరైనా వాహనదారులు సేవా దృక్పథంతో ఎక్కించుకుంటే కొంత వెళ్లి మళ్లీ .. కాలి బాటన 44వ నంబర్‌ జాతీ రహదారిపై వెళ్తూ కనబడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ వద్ద కాలిబాటన వెళ్తున్న ఉత్తరప్రదేశ్‌, జార్కండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన కార్మికులు బైపాస్‌ వద్ద సేదతీరుతూ కనిపించారు.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: కాలిబాట పట్టిన వలస కార్మికుల కష్టాలు

ఇదీచదవండి ఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ

ABOUT THE AUTHOR

...view details