తెలంగాణ

telangana

తల్లి తిట్టిందని.. పదో తరగతి విద్యార్థి బలవన్మరణం

By

Published : May 21, 2020, 11:14 PM IST

బయట తిరగకుండా బుద్ధిగా ఇంటి పట్టున ఉంటూ.. చదువుకొమ్మని తల్లి మందలించినందుకు నిజామాబాద్​ పట్టణంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకున్న విద్యార్థిని బతుకుతాడన్న ఆశతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు విడిచాడు. పోలీసులు విద్యార్థి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tenth Class Student Suicide In Nizamabad Town
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్​ జిల్లాకేంద్రంలోని నామ్​దేవ్​ వాడలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న స్వప్న పదో తరగతి చదువుతున్న కొడుకును బయట తిరగకుండా బుద్ధిగా ఇంట్లో ఉండి చదువుకొమ్మని మందలించింది. తల్లి తిట్టడం వల్ల మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని నిజామాబాద్​ మూడో పట్టణ ఎస్సై సంతోష్​ తెలిపారు. విద్యార్థి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:మాస్క్​తో మార్నింగ్​ వాక్​.. చాలా డేంజర్​!

ABOUT THE AUTHOR

...view details