నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్కు నిరసనగా ఆందోళనకు దిగారు.
ఎల్ఆర్ఎస్లో సడలింపులు చేయాలని రియల్ వ్యాపారుల ర్యాలీ
తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్కు నిరసనగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. ఇది వరకే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను ఈ పథకం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్కు నిరసనగా రియల్ వ్యాపారుల ర్యాలీ
ఎప్పుడో కొనుగోలు చేసిన, ఇదివరకే రిజిస్ట్రేషన్ పూర్తైన ప్లాట్లను ఈ పథకం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ.. ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్‌కు వినతి పత్రం సమర్పించారు.
- ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"