తెలంగాణ

telangana

రాజన్న రాజ్యం కాదు.. రామరాజ్యం కావాలి: అర్వింద్

By

Published : Mar 26, 2021, 10:34 PM IST

వైఎస్‌ షర్మిలను తెలంగాణ రాజకీయాలకు ఆహ్వానిస్తూనే... ఆమెపై వ్యంగ్యాస్తాలు సంధించారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. తెలంగాణలో కావాల్సింది రాజన్న రాజ్యం కాదని... రామరాజ్యం అని పేర్కొన్నారు.

Arvind comments on sharmila
షర్మిలపై అర్వింద్ కమెంట్స్

వైఎస్‌ షర్మిలపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్‌ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి స్వాగతం పలుకుతూనే... వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె అయినంత మాత్రాన రాజశేఖర్‌రెడ్డి కాలేరని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. తెలంగాణలో కావాల్సింది రాజన్న రాజ్యం కాదని... రామరాజ్యం కావాలని అన్నారు.

రాజన్న రాజ్యానికి... రామరాజ్యానికి ఉన్న తేడా ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. రామరాజ్యం అంటే అవినీతి లేని రాజ్యమని... రైతులందరికీ మంచి ధర కల్పించడమన్నారు. ఏదైనా ఒక విషయంపై మాట్లాడే ముందు పూర్తి అవగాహనతో మాట్లాడాని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ పసుపు రైతులకు ఇస్తున్న ధర కంటే... నిజామాబాద్‌లో అధిక ధర ఇస్తున్నామని చెప్పారు.

తెలంగాణ యాస, భాషా నేర్చుకోవడం కోసం షర్మిల చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో అభిమానులు ఉన్న మాట నిజమేనన్నారు.

ఇదీ చూడండి:ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details