తెలంగాణ

telangana

డబుల్ బెడ్​రూం ఇళ్ల కోసం ఆందోళన

By

Published : Feb 12, 2021, 8:29 PM IST

రెండు పడక గదుల ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని నిజామాబాద్​లో భాజపా ఆందోళన నిర్వహించింది. అర్హులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది.

nizamabad bjp Demands double bedroom houses be allocated to the deserving
డబుల్ బెడ్​రూం ఇళ్ల కోసం ఆందోళన

అర్హులకు డబుల్ బెడ్​రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్​ చేస్తూ.. భాజపా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య స్థానికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నెల రోజుల్లోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 50వేల పై చిలుకు దరఖాస్తులు వస్తే.. కేవలం 396 ఇళ్లను నిర్మించారని లక్ష్మీనర్సయ్య గుర్తు చేశారు. నిర్మాణం పుర్తై ఏళ్లు గడుస్తోన్నా.. లబ్ధిదారులను గుర్తించకపోవడం శోచనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గృహ బీమాలో ఏముంటాయ్‌? క్లెయిం ఎలా?

ABOUT THE AUTHOR

...view details