తెలంగాణ

telangana

MP ARVIND : వీరజవాన్ కుటుంబ సభ్యులకు ఎంపీ అర్వింద్ పరామర్శ

By

Published : Jun 25, 2021, 8:54 AM IST

ఇటీవల వీరమరణం పొందిన జవాన్ కల్యాణ్ రావు కుటుంబ సభ్యులను నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌(MP ARVIND) పరామర్శించారు. జవాన్‌ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు. సాంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పథకం కింద దత్తత తీసుకున్న వెల్మల్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులపై గ్రామస్థులతో చర్చించారు.

ఎంపీ అర్వింద్‌
ఎంపీ అర్వింద్‌

ఇటీవల వీరమరణం పొందిన జవాన్ కల్యాణ్ రావు కుటుంబ సభ్యులను నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌(MP ARVIND) పరామర్శించి అతని చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు. డీకంపల్లి చెందిన తండ్రీ కొడుకు సురేశ్‌, యోగేశ్‌ ఇటీవలే పోచంపాడు పుష్కరఘాట్‌లో మరణించగా వారి కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. వారి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

నందిపేట్ మండలంలో సాంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పథకం కింద దత్తత తీసుకున్న వెల్మల్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులపై గ్రామస్థులతో చర్చింనారు. అధ్యక్షులు బస్వ నర్సయ్య, ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పల్ సూర్యనారాయణ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :Jawan: టెలిఫోన్​ స్తంభంపై నుంచి కిందపడి ఆర్మీ జవాన్ మృతి

ABOUT THE AUTHOR

...view details