తెలంగాణ

telangana

సైన్యాన్నీ ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం యత్నం: హరీశ్​రావు

By

Published : Jun 18, 2022, 3:36 PM IST

harish rao on agnipath: 'అగ్నిపథ్​' పేరిట కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశం మొత్తం అట్టుడుకుతోందని మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యాన్నీ ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. భాజపా ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు.

సైన్యాన్నీ ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం యత్నం: హరీశ్​రావు
సైన్యాన్నీ ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం యత్నం: హరీశ్​రావు

harish rao on agnipath: అగ్నిపథ్‌ విధానం యువతకు అర్థం కాలేదని కేంద్రం అనడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్ మండలం మోతెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మోతె బైపాస్ రోడ్డు, మోతె-నడికుడ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడారు. అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశమంతా అట్టుడుకుతోందని.. భాజపా ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు. సైన్యాన్నీ ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు.

సికింద్రాబాద్‌ అల్లర్లను తెరాస చేయించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారన్న మంత్రి.. అలా అయితే.. యూపీలో యోగి, బిహార్‌లో నితీష్ అల్లర్లు చేయించారా? అని ప్రశ్నించారు. ఆర్మీ ఉద్యోగాలను సైతం యువతకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సైన్యంపై కేంద్రం నిర్ణయంతో దేశం అట్టుడుకుతోంది. అగ్నిపథ్ పథకం యువతకు అర్థం కాలేదనటం హాస్యాస్పదం. ఆర్మీని కూడా ప్రైవేట్‌పరం చేయాలని మోదీ చూస్తున్నారు. అడగటానికి వెళ్లిన యువకులపై కాల్పులు జరిపారు. దాడులను తెరాస చేయించిందని బండి సంజయ్‌ అంటున్నారు. మరి ఉత్తరప్రదేశ్‌లో యోగి, బిహార్‌లో నితీశ్‌ చేయించారా?- మంత్రి హరీశ్‌రావు

సైన్యాన్నీ ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం యత్నం: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details