తెలంగాణ

telangana

ప్రభుత్వం ముందుకొచ్చేసరికే…రైతులు అమ్మేశారు..

By

Published : Nov 3, 2020, 11:40 AM IST

అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు అన్న చందాన తయారయ్యింది నిజామాబాద్ జిల్లాలోని మక్క రైతుల పరిస్థితి. మొక్క జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం మద్దతు ధరతో ముందుకొచ్చేసరికే…80శాతం పైగా పంటను రైతులు దళారులకు అమ్మేశారు. ప్రభుత్వం త్వరగా ముందుకు రాకపోవడంతో నష్టానికి అమ్ముకున్నామని వాపోతున్నారు.

As soon as the government came forward..farmers were sold crop
ప్రభుత్వం ముందుకొచ్చేసరికే…రైతులు అమ్మేశారు..

మొక్క జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా..నిజామాబాద్ జిల్లాలో రైతులకు పెద్దగా ప్రయోజనం లేని పరిస్థితి. ప్రభుత్వాన్ని కొనుగోలు చేయమని రైతులు కొంతకాలంగా కోరుతూనే వస్తున్నా…ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో మధ్య దళారుల ద్వారా ప్రైవేటు వ్యాపారులకు మక్కను అమ్మేశారు రైతులు. జిల్లాలో 16 వేలమంది రైతులు 22 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. 4.65 లక్షల క్వింటాల మక్కలు దిగుబడులు వచ్చాయి. దీనిలో ఇప్పటికే 80 శాతానికి పైగా రైతులు తమ మొక్కజొన్నలను అమ్మేశారు. అదీనూ కేవలం కింటా రూ.1000 నుంచి రూ. 1100 చొప్పున.. దీంతో ఒక్కో రైతు మద్దతు ధరతో పోల్చితే కింటాకు సుమారుగా రూ.750 నుంచి రూ.800 వరకు నష్ట పోయారు.

తాజాగా ప్రభుత్వం రూ.1850 ధరతో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో రైతులు అయ్యో తాము తక్కువకు అమ్ముకొని నష్టపోయామని వాపోతున్నారు. తమ వద్ద కొన్న మొక్కజొన్నలను వ్యాపారులు, రైతుల ముసుగులో వచ్చి కొనుగోళ్లు చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: టీ ప్రైడ్‌ పాలసీ కింద ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు మంజూరు

ABOUT THE AUTHOR

...view details