తెలంగాణ

telangana

భార్య, పిల్లలు తనతో ఉండట్లేదని ఆత్మహత్య

By

Published : May 22, 2020, 6:12 PM IST

భార్య, పిల్లలు తనతో ఉండట్లేదని నిజామాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి... చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

భార్య, పిల్లలు తనతో ఉండట్లేదని ఆత్మహత్య
భార్య, పిల్లలు తనతో ఉండట్లేదని ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ శివారులోని అశోక్ సాగర్ చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన గుంజాల జగదీశ్(48) పురుగుల మందు తాగి... చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

జగదీశ్ భార్య, పిల్లలు రెండున్నరేళ్లుగా తనతో ఉండక పోవడం వల్ల మద్యానికి బానిసయ్యాడు. తీవ్ర మనస్తాపంతో చెరువులో దూకి ... ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details