తెలంగాణ

telangana

Child Marriage Took Place in Nizamabad : 42 సంవత్సరాల వ్యక్తితో 13ఏళ్ల బాలిక పెళ్లి

By

Published : Jul 9, 2023, 1:01 PM IST

Minor Married to 42 Years Old Man : నిజామాబాద్​ నవీపేట మండలంలోని తండాలో బాల్యవివాహం జరిగింది. 13ఏళ్ల బాలికకు 42ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి అపడానికి వెళ్లిన అధికారులు, పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. బాల్య వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు పెళ్లికి సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి హైమద్‌ నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Etv Bharat
Etv Bharat

A 13 Year Old Girl Married 42Year Old Man in Nizamabad : ఆ అమ్మాయికి అమ్మ లేకపోవడమే శాపంగా మారింది. మంచిచెడుల్లో తోడుండాల్సిన తల్లి చనిపోవడంతో మద్యానికి బానిసైన తండ్రి నీడలో పెరుగుతోంది. దానికి తోడు పేదరికం ఆమె పెళ్లికి మరో కారణమైంది. ఎదురు కట్నం వస్తుందని ఆశించిన ఆ తండ్రి తన కన్న కూతురుకంటే మూడింతలు వయస్సున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయడానికి సిద్దమయ్యాడు. సరైన సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు, అధికారులు ఈ చిన్నారి జీవితాన్ని కాపాడారు.

భారతదేశంలో మహిళాభివృద్ధి రోజురోజుకు ఎంతో పెరుగుతుందో దాంతో పాటు అన్ని అత్యాచారాలు, బాల్య వివాహాలు, హత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం బాల్య వివాహాలు అరికట్టడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. 18ఏళ్లు నిండితేనే అమ్మాయికి పెళ్లి చేయాలని కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు తీసుకొచ్చినా బీదరికం వాళ్లని బాల్య వివాహాలని వదలకుండా చేస్తోంది. ఈ రోజుల్లో కూడా అభం శుభం తెలియని చిన్నారులను సంసార సాగరంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిలేని బిడ్డ అని 13ఏళ్ల బాలికను 42 సంవత్సరాల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.

నిజామాబాద్​ జిల్లా ననీపేట మండలంలోని ఓ తండాలో శుక్రవారం రాత్రి బాల్య వివాహం జరిగింది. పోలీసులు, అధికారులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన 13ఏళ్ల బాలికకు, ఫకీరాబాద్​కు చెందిన 42ఏళ్ల సాహెబ్​రావు అనే వ్యక్తితో వివాహం జరిపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి సాహెబ్​రావు బాలికను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో పెళ్లి అడ్డుకునేందుకు వచ్చిన అధికారులతో స్థానికులు గొడవకు దిగారు. డీసీపీవో చైతన్య కుమార్​ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు వెళ్లి విచారణ చేపట్టారు. బాల్య వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు పెళ్లికి సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి హైమద్‌ నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇది వరకే పెళ్లై ఇద్దరు కుమారులు ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ప్రాజెక్టు సమన్వయకర్త జోత్స్న దేవి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details