తెలంగాణ

telangana

Rythu avedana yatra : 'పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలి'

By

Published : Dec 22, 2021, 4:20 PM IST

Updated : Dec 22, 2021, 4:35 PM IST

Rythu avedana yatra : రైతు రుణమాఫీ చేసి ఉంటే రాష్ట్రంలో ఇన్ని ఆత్మహత్యలు జరిగేవా అని వైఎఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గత రెండు నెలల కాలంలో సుమారు 200కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

rythu avedana yatra
rythu avedana yatra

Rythu avedana yatra : రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ కారణమని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల అన్నారు. గత రెండు నెలల్లో సుమారు 200 మంది అన్నదాతలు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. " రైతు ఆవేదన యాత్ర" లో భాగంగా నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని గంగాపూర్ తండా, దిలావర్ పూర్ మండలంలోని కాల్వతండా గ్రామల్లో ఆమె పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయాన్ని అందించారు.

ys sharmila comments on kcr : వరి పంటకు మద్దతు ధర వస్తుందన్న భరోసాతోనే రైతులు వరి పండిస్తున్నారని.. ఇప్పుడు వరి పంటను వేయొద్దనడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాక.. మంత్రులను దిల్లీకి పంపి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్నదాతల పక్షాన పోరాడుతామని తెలిపారు.

ys sharmila padayatra : రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో 7వేల ఆత్మహత్యలు జరిగాయని.. వాటన్నింటికి సీఎం కేసీఆర్​ కారణమని పేర్కొన్నారు. బలవన్మరణానికి పాల్పడిన ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పైసా కూడా ఇవ్వని ముఖ్యమంత్రి.. దిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేసిన వారికి ఆర్థిక సాయం అందిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసమే... ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

'పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలి'

'రాష్ట్రంలో ప్రతి రోజు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్​. కేసీఆర్​కు పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేయాలి. రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది. దిల్లీలో అపాయింట్​మెంట్​ లేకుండా వెళ్లి డ్రామాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మీ కుటుంబం తప్ప ఏ వర్గమైనా సంతోషంగా ఉందా? '- వైఎస్​ షర్మిల, ఎఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు

ఇదీ చూడండి:Jaggareddy letter to CM KCR: కేసీఆర్​కు జగ్గారెడ్డి 12 గంటల డెడ్​లైన్​... లేకుంటే

Last Updated : Dec 22, 2021, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details