తెలంగాణ

telangana

'సమస్యలు పరిష్కరించే వరకు కదలం.. హోలీ పండుగ ఇక్కడే చేసుకుంటం'

By

Published : Mar 17, 2022, 3:49 PM IST

మంచినీళ్లు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజనులు చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గిరిజనులు కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపట్టారు.

Tribals protest at collectorate
కలెక్టరేట్ వద్ద దీక్ష చేపడుతున్న గిరిజనులు

తమ గూడెంలో మంచినీటి, విద్యుత్ సౌకర్యం కల్పించకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని గిరిజనులు స్పష్టం చేశారు. పిల్లలతో సహా 75 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టిన అనంతరం కలెక్టరేట్ ముందు నిరసన దీక్షకు దిగారు. గతేడాది జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని పెంబి మండలం చాకిరేవుకు చెందిన గిరిజనులు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజుకు చేరింది. పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు.

కలెక్టరేట్ వద్ద దీక్ష చేపడుతున్న గిరిజనులు

తమకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేవరకు దీక్ష విరమించేది లేదని గ్రామస్థుడు నాయక్ అన్నారు. తమకు మొదట నీటి వసతి కల్పించాలని కోరారు. రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇస్తేనే దీక్షను విరమిస్తామని చెప్పారు. తమ కులదేవతగా పాదాల సాక్షిగా ప్రమాణం చేసి వచ్చామని.. హోలీ పండుగను సైతం ఇక్కడే నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. దీక్షలో పాల్గొన్న మహిళలు, పిల్లలకు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు.

మన గిరిజన మంత్రి సత్యవతి రాఠోడ్ గారు వెంటనే స్పందించాలని కోరుతున్నాం. చాకిరేవు గ్రామంలో తాగునీరు, కరెంట్ సమస్యను పరిష్కరించాలి. హోలీ పండుగ కూడా ఇక్కడే చేస్తాం. మా సమస్యను పరిష్కస్తేనే ఇక్కడి నుంచి కదలం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. - నాయక్, చాకిరేవు గ్రామం

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details