తెలంగాణ

telangana

'అవార్డులు, ప్రశంసలు కాదు నిధులు కేటాయించండి'

By

Published : Nov 20, 2019, 6:27 PM IST

Updated : Nov 20, 2019, 7:53 PM IST

నిర్మల్ జిల్లా భైంసా విశ్రాంతి భవనంలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల గురించి తెలిపారు.

'అవార్డులు, ప్రశంసలు కాదు నిధులు కేటాయించండి'

కేంద్ర ప్రభుత్వ మంత్రులంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి మెచ్చుకున్నారని తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి తెలిపారు. ఇంటింటికీ నీళ్లందించేందుకు తీసుకొచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఒక నవోదయ, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు రావట్లేదని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి తెలిపారు.

'అవార్డులు, ప్రశంసలు కాదు నిధులు కేటాయించండి'
రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ తాజాలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మంత్రులంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి సంతృప్తి వ్యక్త పరిచారన్నరు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అందరికి ఇంటింటికి మంచినీటిని అందించాలనే ఉద్దేశ్యం తో జలయోజన పథకంలో లో భాగమైన తెలంగాణ లోని మిషన్ భగీరత, మిషన్ కాకతీయ కు తక్షణమే 25 వేళా కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు,ప్రతి జిల్లాలో ఒక నవోదయ స్కూల్,మెడికల్ కాలేజి ఏర్పాటు చేసే విదంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రవేశ పెట్టిన పతకాలకు అవార్డులు,ప్రశంసలు వస్తున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన దాఖలాలు లేవని అన్నారు
Last Updated :Nov 20, 2019, 7:53 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details