తెలంగాణ

telangana

'దేశంలో ఎక్కడాలేని విధంగా అన్నదాతల కోసం రైతు వేదికలు'

By

Published : Feb 18, 2021, 4:45 PM IST

నిర్మల్ జిల్లా తారోడాలో రైతు వేదికను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అన్నదాతల కోసం వేదికలను కేసీఆర్​ ఏర్పాటు చేశారన్నారు. అందరు ఒకే చోట కూర్చొని సమస్యలపై చర్చించుకోవాలని సూచించారు.

MLA Vital Reddy inaugurated the Raithu Vedika in Taroda In Nirmal district
రైతు వేదిక ప్రారంభంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

అన్నదాతల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు వేదికలను సీఎం కేసీఆర్​ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు ప్రతి సంఘానికి భవనాలు ఉండేవని పేర్కొన్నారు.

తెరాస అధికారంలోకొచ్చాక రైతుల కోసం ఆలోచించి అన్నదాతలు ఒకేచోట కూర్చొని వారి సమస్యలు చర్చించుకోవడానికే వేదికలు నిర్మించామన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తారోడాలో రైతు వేదికను ప్రారంభించారు.

తారోడాలో కూరగాయలు బాగా పండిస్తారని కొనియాడారు. అంకాపూర్ తరువాత తారోడానే కూరగాయలు పండించటంలో ముందుందన్నారు. గ్రామ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:శ్రీనివాస్ గౌడ్​ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీశ్​

ABOUT THE AUTHOR

...view details