తెలంగాణ

telangana

బాసర ట్రిపుల్‌ ఐటీకి మంత్రి సబిత.. వర్షంలోనే చర్చలు

By

Published : Jun 20, 2022, 9:28 PM IST

Updated : Jun 20, 2022, 9:55 PM IST

బాసర ట్రిపుల్‌ ఐటీకి మంత్రి సబిత.. వర్షంలోనే చర్చలు
బాసర ట్రిపుల్‌ ఐటీకి మంత్రి సబిత.. వర్షంలోనే చర్చలు

21:25 June 20

బాసర ట్రిపుల్‌ ఐటీకి మంత్రి సబిత.. వర్షంలోనే చర్చలు

సమస్యలు పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు వరుసగా ఏడోరోజూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎండ, వాన, పగలు, రాత్రీ అనే తేడా లేకుండా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్దే బైఠాయించారు. అధికారులు నచ్చజెప్పినా, మంత్రులు బుజ్జగించినా డిమాండ్లు నెరవేర్చే వరకూ.. పోరుబాట వీడబోమని తేల్చి చెబుతున్నారు. వర్షంలో తడుస్తూనే తమ 12 డిమాండ్లపై... విద్యా శాఖ మంత్రి నుంచి రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఫలితంగా.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్‌ ఐటీకి బయలుదేరి వెళ్లారు. విద్యార్థి ప్రతినిధులతో మంత్రి చర్చలు జరుపుతున్నారు. వర్షంలోనే దాదాపు 6వేల మంది విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రిపుల్‌ ఐటీ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి..

వర్షంలోనూ కొనసాగుతున్న ఆందోళన.. అప్పటివరకు తగ్గేదేలే...!

నాలుగో రోజు రాహుల్​కు ఈడీ ప్రశ్నలు.. మళ్లీ రావాలంటూ సమన్లు..

Last Updated :Jun 20, 2022, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details