తెలంగాణ

telangana

నిర్మల్​ను క్లీన్ సిటీగా మార్చేస్తాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

By

Published : Oct 20, 2020, 7:11 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో రూ.50 లక్షలతో రహదారిని శుభ్రపరిచే వాహనాన్ని కొనగోలు చేశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మరో రెండు వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

minister indrakaran reddy on development programs in nirmal
'నిర్మల్​ను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం'

నిర్మల్ మున్సిపల్ ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన... రహదారి శుభ్రపరిచే వాహనాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో రూ.50 లక్షలతో ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

మరో రెండు వాహనాలు కొనుగోలు చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రోత్ ఈశ్వర్, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణలో దసరా వరకూ పరీక్షలన్నీ వాయిదా

ABOUT THE AUTHOR

...view details