తెలంగాణ

telangana

పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం : మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

By

Published : Sep 12, 2020, 1:01 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రాన్ని మరింత సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్​ పట్టణంలోని సోమవార్ పేట్, నాయుడువాడలో ఆయన పర్యటించారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా చేపట్టనున్న డ్రైనేజీ కాలువ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

Minister Indrakaran Reddy inaugurates Road And Drainage  Works in Nirmal
పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం : మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి నిర్మల్​ జిల్లా కేంద్రంలో పర్యటించారు. పట్టణ కేంద్రంలోని సోమవార్​పేట్​, నాయుడువాడలలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా నిర్మించనున్న డ్రైనేజీ కాలువ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. నిర్మల్​ జిల్లా కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే రోడ్ల విస్తరణ పూర్తయిందని తెలిపారు. స్థానిక చైన్​ గేట్​ నుంచి చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారని, రోడ్డు వెడల్పు పనుల్లో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే.. నగరానికి కొత్త కళ వస్తుందని మంత్రి అన్నారు. ఆయా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ గండ్రోత్​ ఈశ్వర్​, వైస్​ ఛైర్మన్​ షేక్​ సాజిద్​, కమిషనర్​ బాలకృష్ణ, కౌన్సిలర్లు రఫూ, ఎస్పీ రాజు, పట్టణాధ్యక్షులు మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details