తెలంగాణ

telangana

'గవర్నర్ హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు గౌరవం'

By

Published : Apr 8, 2022, 12:41 PM IST

Minister Indrakaran Reddy on Governor comments: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ వ్యాఖ్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. యాదాద్రికి వెళ్లే 10 నిమిషాల ముందు చెబితే ప్రొటోకాల్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన ఇంద్రకరణ్ రెడ్డి.. గవర్నర్​ మాటలు ఎవరూ నమ్మే అవకాశం లేదని స్పష్టం చేశారు.

minister indrakaran reddy response on governor statement
గవర్నర్​ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

Minister Indrakaran Reddy on Governor comments: గవర్నర్ తమిళిసై​ యాదాద్రికి వెళ్లే 20 నిమిషాల ముందు చెబితే ప్రొటోకాల్​ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమవుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్​ హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకిచ్చే గౌరవం ఉంటుందని.. రాజ్యాంగపరంగా మర్యాద తప్పక ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పాలనపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యల పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

"గవర్నర్ తమిళిసై.. కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత రాష్ట్రంలో పాలనపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో తనను అవమానపరుస్తున్నారని అనడం సరికాదు. ఆమెను ఎక్కడ అవమానించారో చెప్పాలి. యాదాద్రికి వెళ్లే 10, 20 నిమిషాల ముందు చెబితే ప్రొటోకాల్​ ఏర్పాటుచేయడం ఎలా సాధ్యమవుతుంది?. రాజ్యాంగబద్ధంగా గవర్నర్​కు ఇచ్చే మర్యాద తప్పకుండా ఇస్తాం." -ఇంద్రకరణ్​ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

రాజకీయ పార్టీ నుంచి ఎవరూ రాలేదు:ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్​లే గవర్నర్లుగా వచ్చారని.. రాజకీయ పార్టీ నుంచి కాదని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. గవర్నర్ ఎప్పుడూ భాజపా వైపే చూస్తారని.. ఆమె మాటలు ఎవరూ నమ్మే అవకాశం లేదని వెల్లడించారు. తమిళిసై హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు.

గవర్నర్ హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు గౌరవం: మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

ఇదీ చదవండి:గవర్నర్​ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్​.. ఏమన్నారంటే..?

ABOUT THE AUTHOR

...view details