తెలంగాణ

telangana

నెర‌వేరిన‌ దశాబ్ధాల కల... స్వ‌ర్ణ వాగుపై లో-లెవ‌ల్ కాజ్​వే ప్రారంభం

By

Published : Jun 7, 2021, 7:25 PM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జౌలి గ్రామ‌స్థుల దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలో భాగంగా స్వ‌ర్ణ ప్రాజెక్ట్ వ‌ద్ద‌ రూ.90 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన‌ లో-లెవ‌ల్ కాజ్​ వేను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు.

Low Level Cause way at Swarna Project
Low Level Cause way at Swarna Project

స్వ‌ర్ణ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడే లో-లెవ‌ల్ కాజ్ వే నిర్మించి ఉండాల్సిందని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. వంతెన లేక‌పోవ‌డం వల్ల జౌలి గ్రామప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలంలో స్వర్ణ ప్రాజెక్టు వద్ద నిర్మించిన లో-లెవల్​ కాజ్​వేను మంత్రి ప్రారంభించారు.

ఎన్నిక‌ల హామీ మేర‌కు గ‌తేడాదిలో కాజ్ వే నిర్మాణానికి భూమి పూజ చేశామని... ఏడాదిలోనే నిర్మాణం పూర్తైంద‌ని తెలిపారు. వంతెన అందుబాటులోకి రావ‌డం వల్ల రైతుల‌కు, విద్యార్థుల‌కు దూర భారం త‌గ్గుతుంద‌ని వివ‌రించారు.

ఇదీ చూడండి:chada venkat reddy: సీఎం కేసీఆర్​కు చాడ లేఖ

ABOUT THE AUTHOR

...view details