తెలంగాణ

telangana

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్న స్థానికులు

By

Published : Jun 2, 2021, 3:38 PM IST

నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. 2015లో కుబీర్​ రోడ్డు విస్తీర్ణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని మంత్రిని నిలదీశారు. ఇప్పటివరకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదని నిర్వాసితుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Locals obstruct Minister Indira Reddy
భైంసాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్న స్థానికులు

భైంసాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్న స్థానికులు

నిర్మల్​ జిల్లాలోని భైంసా పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. పట్టణంలోని బురుడు గల్లీకి చెందిన కొందరు స్థానికులు 2015లో కుబీర్​ రోడ్డు విస్తీర్ణం కోసం తమ ఇళ్లను కోల్పోయారు. మంత్రి పట్టణంలో వైకుంఠధామం ప్రారంభించడానికి రాగా... స్థానికులు అడ్డుకుని తమకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారని మంత్రిని నిలదీశారు. 2015లో ఇళ్లను కూలగొట్టి... కొత్తవి కట్టిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు దిక్కులేదని వాపోయారు. హామీ ప్రకారం రెండుపడక గదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎప్పుడు కట్టిస్తారని మంత్రిని అడగగా... మీ ఎమ్మెల్యేను అడగాలని చెప్పి మంత్రి వెళ్లిపోయారు.

కార్యాలయాలు చుట్టూ తిరిగి ధర్నాలు చేస్తే 160 రెండు పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే చుట్టూ ఇళ్లు కట్టించండి అంటూ 4 నెలల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు కట్టించకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కాగా... మంత్రికి తమ గోడువిన్నవించినా పట్టించుకోవటంలేదని.... ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఆకాశంలో అద్భుతం 'హలో'.. ఈ ఏడాది ఏం జరగనుంది?

ABOUT THE AUTHOR

...view details