తెలంగాణ

telangana

No Funds For RGUKT Basar : ఆర్థిక సమస్యల్లో ఆర్జీయూకేటీ.. ఇబ్బందుల్లో విద్యార్థులు

By

Published : Mar 7, 2022, 7:07 AM IST

No Funds For RGUKT Basar : నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ విద్యాలయానికి నిధుల కేటాయింపులో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. బడ్జెట్‌లో ఈ విద్యాలయానికి రూ.23 కోట్ల పద్దు చూపిన ప్రభుత్వం రూ.7 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీనివల్ల విద్యార్థులకు అవసరమైన పలు సౌకర్యాలు దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

No Funds For RGUKT Basar
No Funds For RGUKT Basar

No Funds For RGUKT Basar : చదువుల తల్లి జ్ఞాన సరస్వతి కొలువైన నిర్మల్‌ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ విద్యాలయానికి సంపదల తల్లి లక్ష్మీ కటాక్షం కరవవుతోంది. రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం విద్యాలయానికి నిధుల విడుదలో చిన్నచూపు చూస్తుండటం ఇక్కడ విద్యార్థులకు అవసరమైన పలు సౌకర్యాలను దూరం చేస్తోంది.

RGUKT Basara Funds Issue : రాష్ట్రంలోనే ఏకైక ఆర్జీయూకేటీగా పేరుగాంచిన బాసర విద్యాలయ నిర్వహణకు నెలకు రూ.6 కోట్లు చొప్పున ఏడాదికి రూ.72 కోట్లు అవసరం. ఇందులో ఉద్యోగుల వేతనాలకే రూ.24 కోట్లు కావాలి. 800 మంది విద్యార్థుల భోజన సౌకర్యానికి రూ.20-25 కోట్లు ఖర్చవుతాయి. అయితే మూడేళ్లుగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఎక్కువగా చూపిస్తూ.. ప్రతి సంవత్సరం రూ.నాలుగైదు కోట్లే విడుదల చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో విద్యాలయానికి రూ.23 కోట్ల పద్దు చూపిన ప్రభుత్వం రూ.7 కోట్లు మాత్రమే విడుదల చేసింది. విద్యాలయానికి నిధుల కేటాయింపు లేకపోవటంతో విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాల్లో కోతపడుతోంది. వచ్చే బడ్జెట్‌లోనైనా ప్రభుత్వం నిధులు కేటాయించి, సత్వరం విడుదల చేస్తేనే విద్యాలయ నిర్వహణ మెరుగుపడుతుందని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.

ఇవీ ఇబ్బందులు

  • విద్యార్థులకు అత్యావశ్యకమైన ల్యాప్‌టాప్‌ల పంపిణీ నాలుగేళ్ల నుంచి నిలిచిపోయింది.
  • విద్యార్థులకు ఏకరూప దుస్తులు(యూనిఫారమ్‌) అందించడంలేదు.
  • బెడ్లు లేక 800 మంది విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు.
  • భోజనాల్లో పౌష్టికాహారం లోపించింది.
  • ల్యాబ్‌ల్లో వార్షిక నిర్వహణ లేక విలువైన పరికరాలు పాడవుతున్నాయి.
  • పరిశోధనలకు నిధుల కొరత నెలకొంది.
  • చెత్తసేకరణ వాహనాలు, అంబులెన్స్‌కు డీజిలు లేక అవి మూలనపడ్డాయి.
  • ఆరు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడంలేదు.

ABOUT THE AUTHOR

...view details