తెలంగాణ

telangana

మంత్రి ఇంద్రకరణ్​కు చేదు అనుభవం.. రైతుల ఆగ్రహం

By

Published : Feb 13, 2021, 2:17 PM IST

రైతు వేదిక భవన ప్రారంభోత్సవానికి బయలు దేరిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్​ జిల్లా మామడ మండలం పోన్క్​ల్​ లో ఆయన కాన్వాయ్​ను రైతులు అడ్డుకున్నారు. సాధర్మాట్​ బ్యారేజీ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

minister indrakaran reddy
మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్​ను రైతులు అడ్డుకున్నారు. గ్రామంలో రైతు వేదిక భవన ప్రారంభోత్సవానికి మంత్రి వెళ్లారు. ఈ క్రమంలో సాధర్మాట్ బ్యారేజీలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తాము మూడేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమను పట్టించుకోవడం లేదని.. నష్టపరిహారం ఇచ్చేంతవరకు గ్రామంలోకి వెళ్లనివ్వబోమని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. ఒక దశలో రైతులపై మంత్రి ఆగ్రహావేశానికి గురయ్యారు. చివరకు మూడు నెలల్లో నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.

ఇదీ చదవండి:జానారెడ్డి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు: మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details