తెలంగాణ

telangana

వైభవంగా శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు

By

Published : Oct 20, 2020, 12:33 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. దేవి దర్శనానికి భక్తులు తరలొస్తున్నారు.

devi navarathri ustaval in basara
నాలుగో రోజుకు చేరుకున్న శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు

నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం కూష్మాండ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రలతో అమ్మవారికి 'అల్లం వడలు(గారెలు)' నైవేద్యంగా సమర్పించారు. అమ్మవార్లకు కుంకుమార్చన, హారతితో విశేష పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఇదీ చూడండి:నమ్మకంగా పనిచేస్తారు.. మత్తుమందిచ్చి ఇళ్లంతా దోచేస్తారు

ABOUT THE AUTHOR

...view details